శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు..

-

కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోతోంది. రెండేళ్ళ తరువాత శ్రీనివాసుడి దర్శనార్ధం అధిక సంఖ్యలో తిరుమలకు ఇచ్చేసిన భక్తులతో క్యూలైన్లు కిటకిట లాడుతున్నాయి. వీకెండ్ కావడంతో కొండపై ఊహించని రీతిలో‌ ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొదలుకొని, క్యూలైన్స్ పూర్తిగా భక్తులతో నిండి పోయింది. విశేష సంఖ్యలో వచ్చిన భక్తుల గోవింద నామస్మరణలతో శేషాచలం మారుమ్రోగుతున్నాయి. ఇక శ్రీ వేంకటేశ్వరుడి దర్శనార్ధం నిత్యం వేలాది సంఖ్యలో భక్తులు వివిధ రాష్ట్రాల నుండి తిరుమలకు చేరుకుంటారు.

TTD starts issuing offline Sarvadarshan tokens, devotees flock to Tirumala  for tickets

కోవిడ్ పూర్తి స్ధాయిలో అదుపులోకి రావడంతో టీటీడీ సామాన్య భక్తులకు పెద్ద పీఠ వేస్తూ టిక్కెట్లు లేకుండానే భక్తులను కొండకు అనుమతిస్తూ వస్తుంది. ఈ క్రమంలో గత కొద్ది నెలలుగా భక్తుల సంఖ్య భారీగా తిరుమలలో కొనసాగుతూ వస్తుంది.. అయితే ప్రస్తుతం పదోవ తరగతి పరిక్షలు పూర్తి కావడంతో తిరుమల యాత్రకు విచ్చేసిన భక్తులతో తిరుమలగిరులు నిండి పోయింది.‌. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1,2 లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండి పోవడంతో సర్వదర్శనం క్యూలైన్ లేపాక్షి సర్కిల్ దాటుకుని షాపింగ్ కాంప్లెక్స్ మీదుగా పాత అన్నదాన సత్రం వరకూ చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news