కేంద్రం కరోనా పై స్పెషల్ ఫోకస్ ప్రారంభించింది. దేశంలో కరోనా వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో అంచనా వేసేందుకు కరోనా వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు కట్టుబాటు చర్యలను ప్రారంభం చేసింది. కేంద్రం ఎప్పటికప్పుడు ఏ రాష్ట్రం లో ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసుకుంటూనే ఉంది. కొన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వాలతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి డైరెక్ట్ గా వారినే అడిగి తెలుసుకుంటుంది కొన్ని సార్లు కేంద్రం నుండి ఓ టీమ్ ను పంపి వారి ద్వారా పరిస్థితులపై అంచనాలు వెయిస్తూ దృష్టి సారిస్తుంది. ఇక ఇదే తరహాలో నేడు తెలంగాణ్ రాష్ట్రానికి కేంద్రం నుండి ఓ టీమ్ రానుంది. ఇక్కడి కరోనా పరిస్థితులను అంచనా వేసేందుకు స్వయంగా తమ టీమ్ నే కేంద్రం పంపుతుంది. కరోనా నియంత్రణపై సమీక్షకు నాలుగోసారి సెంట్రల్ టీమ్ తెలంగాణకు రానుంది. రాష్ట్ర వ్యాప్తంగా తమ రీతిలో రీసర్చ్ చేసి ఓ అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి రికార్డ్ ను పంపనుంది. . కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై అంచనా వేయనున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్ తోపాటు కరోనా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించనున్నాయి.