పది వేలకే 5G ఫోన్‌ను లాంచ్‌ చేసిన లావా..! ఫీచర్స్‌ ఇవే..!

-

లావా బ్లేజ్ 2 5జీ ఇండియాలో లాంచ్ అయింది. గతేడాది లాంచ్ అయిన లావా బ్లేజ్ 5జీకి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. మూడు కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇందులో 6.56 అంగుళాల 2.5డీ కర్వ్‌డ్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇంకా ఫోన్‌ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

లావా బ్లేజ్ 2 5జీ ధర, ఫీచర్లు

ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.9,999గా నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
గ్లాస్ బ్లాక్, గ్లాస్ బ్లూ, గ్లాస్ లావెండర్ కలర్ ఆప్షన్లలో లావా బ్లేజ్ 2 5జీని కొనుగోలు చేయవచ్చు. లావా ఈ-స్టోర్, అమెజాన్ ఇండియా స్టోర్లలో నవంబర్ 9వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది.

లావా బ్లేజ్ 2 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై లావా బ్లేజ్ 2 5జీ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్‌ను కూడా అందిస్తామని కంపెనీ అంటోంది. ఇందులో 6.56 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. పంచ్ హోల్ కటౌట్ ఉన్న 2.5డీ కర్వ్‌డ్ స్క్రీన్ ఉంది.
సెల్ఫీ కెమెరా కోసం హోల్ పంచ్ కటౌట్ అందుబాటులో ఉంది.
ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 6 జీబీ వరకు ర్యామ్ ఈ ఫోన్‌లో ఉంది. దీన్ని వర్చువల్‌గా 12 జీబీ వరకు పెంచుకోవచ్చు.

కెమెరా క్వాలిటీ

ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 0.08 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. 128 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్ లాంచ్ అయింది. 1 టీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకునే అవకాశం ఉంది.

5జీ, 4జీ, బ్లూటూత్, ఎఫ్ఎం రేడియో, వైఫై, ఓటీజీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ ఫీచర్లు అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.84 సెంటీమీటర్లు కాగా, బరువు 203 గ్రాములుగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news