రూ.5,774కే లావా జ‌డ్61 ప్రొ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్

-

మొబైల్స్ త‌యారీదారు లావా.. జ‌డ్‌61 ప్రొ పేరిట ఓ నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేసింది. ఇందులో 5.45 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 2జీబీ ర్యామ్‌ల‌ను అందిస్తున్నారు. వెనుక భాగంలో 8 మెగాపిక్స‌ల్, ముందు భాగంలో 5 మెగాపిక్స‌ల్ కెమెరాలు ఉన్నాయి. ముందు కెమెరాకు ఫేస్ అన్‌లాక్ స‌దుపాయాన్ని అందిస్తున్నారు. దీంతో ఫోన్‌ను కేవ‌లం 0.6 సెక‌న్ల వ్య‌వధిలోనే అన్‌లాక్ చేయ‌వ‌చ్చు. ఈ ఫోన్‌లో 3100 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఏర్పాటు చేశారు.

Lava Z61 Pro smart phone launched in India

లావా జ‌డ్‌61 ప్రొ స్పెసిఫికేష‌న్లు…

* 5.45 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
* 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 2జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్
* 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్
* డ్యుయ‌ల్‌సిమ్‌, 8, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్‌, ఫ్రంట్ కెమెరాలు
* 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3100 ఎంఏహెచ్ బ్యాట‌రీ

లావా జ‌డ్‌61 ప్రొ స్మార్ట్‌ఫోన్ మిడ్‌నైట్ బ్లూ, ఆంబ‌ర్ రెడ్ క‌ల‌ర్ ఆప్షన్ల‌లో విడులైంది. ఈ ఫోన్‌ను వినియోగ‌దారులు రూ.5,774 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news