ప్రైవేట్ స్కూల్స్ నయా దందా షురూ…!

-

రోజుకి ప్రైవేట్ స్కూల్స్ దోపిడి మరింతగా పెరిగిపోతోంది. ఈ సంవత్సరం గాను ఇంకా పాఠశాల మొదలు కాకముందే ఆన్లైన్ క్లాసులు అంటూ పిల్లల తల్లిదండ్రుల వద్ద ఫీజులను ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి కొన్ని ప్రైవేట్ పాఠశాలలు. షూస్, యూనిఫామ్స్, బుక్స్ అంటూ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధర పెట్టి పిల్లల తల్లిదండ్రులను ఈ కరోనా సమయంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అయితే ఆన్లైన్ క్లాసులకు షూస్, యూనిఫామ్ ఇప్పుడే అవసరమా అంటే…? అవును అని సమాధానం ఇస్తున్నారు ప్రైవేట్ పాఠశాల యజమానులు.

online
online

ఇక్కడ వింత ఏమిటంటే… ఆన్లైన్ క్లాసులో కూడా విద్యార్థులు యూనిఫామ్, షూ వేసుకుని ఆన్లైన్ క్లాస్ వినాలట. ఈ దెబ్బతో కొన్ని విద్యాసంస్థలు తల్లిదండ్రుల దగ్గర భారీ దోపిడీకి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆన్లైన్లో పాఠాలు చెబుతున్నామంటూ వారం కొకసారి తల్లిదండ్రుల వద్ద ఫీజులను దండుకుంటున్నాయి. తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వాలకు ఫిర్యాదులు అందినా… ప్రభుత్వం తరపు నుండి పెద్దగా ఈ విషయాలపై చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news