ఆర్జీవీ “పవర్ స్టార్” ఫస్ట్‌లుక్ విడుదల..!

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా క్లైమాక్స్, నేకెడ్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్జీవి రానున్న రోజుల్లో కరోనావైరస్, థ్రిల్లర్, మర్డర్ చిత్రాలు రిలీజ్‌కు సిద్దంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా పవర్ స్టార్‌ మూవీని తెరకెక్కించనున్నట్టు ప్రకటించారు.

అయితే తాజాగా “పవర్ స్టార్” యొక్క ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ని విడుదల చేసారు. ఆ ఫస్ట్‌ లుక్‌లో నలుపు రంగు వేసుకొని ఉన్న ఓ వ్యక్తి బాధలో ఉన్నట్లుగా ఉంది. పోస్టర్‌పై ఎన్నికల ఫలితాల తర్వాత కథ అంటూ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు వర్మ. అలాగే ఆ టైటిల్ ‌లోగోలో టీ గ్లాసు ఉండడం ఎంతగానో ఆసక్తి రేపుతోంది. కాగా వర్మ మాత్రం ఇది ఎవరిని ఉద్దేశించి తీస్తున్న సినిమా కాదని స్ఫష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news