Lavanya Tripathi : ఫారిన్ వీధుల్లో ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తున్న డింపుల్ బ్యూటీ

-

అందాల రాక్షసి లావణ్య ప్రస్తుతం సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. విదేశీ వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతూ టైంపాస్ చేస్తోంది. తన వెకేషన్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు అప్డేట్స్ ఇస్తోంది. తాజాగా లావణ్య షేర్ చేసిన ఫొటోలు చాలా క్యూట్ గా ఉన్నాయి. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

లావణ్యకు సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. అందుకే తను పోస్టు చేసిన ఫొటోలు క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో లావణ్య క్యాజువల్ ప్యాంట్ అండ్ టీ షర్ట్ వేసుకుని ఆ పైన జాకెట్ తో క్లాసీ టచ్ ఇచ్చింది. ఇక హెయిర్ ను లూస్ గా వదిలేసి తన క్యూట్ డింపుల్స్ తో మాయ చేసింది. ఫారిన్ వీధుల్లో హాట్ హాట్ సమ్మర్ లో కూల్ కూల్ గా ఐస్ క్రీమ్ తింటూ పోజులిచ్చింది.

ఈ ఫొటోల్లో లావణ్యను చూసి కుర్రాళ్లు ఎంతగా మెస్మరైజ్ అవుతున్నారో ఐస్ క్రీమ్ ను చూసి అంతే ఖుష్ అవుతున్నారు. ఆ బ్యూటీ కూల్ లుక్స్ తో ఆ ఐస్ క్రీమ్ ఇంకాస్త కూల్ అవుతుందని కామెంట్లు చేస్తున్నారు. లావణ్య డింపుల్స్ చాలా అందంగా ఉన్నాయంటూ పొగుడ్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news