వివేక హత్య కేసులో సిబిఐ తన విచారణను వేగవంతం చేసింది. కాగా సిబిఐ ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా విచారించాలని నోటీసులు జారీ చేయగా, అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హై కోర్ట్ లో పిటీషన్ వేసి ఉన్నారు. ఈ పిటీషన్ లో తీర్పు వచ్చే వరకు విచారణకు హాజరు కాలేనని ఇప్పటికే అవినాష్ రెడ్డి చెప్పాడు, కాగా హై కోర్ట్ కూడా మధ్యాహ్నం తీర్పు వచ్చే వరకు విచారణకు పిలవద్దని తెలిపింది. అయితే ఈ విచారణ జరగకుండానే రేపటికి వాయిదా వేసింది హై కోర్ట్. అవినాష్ రెడ్డిని సిబిఐ రేపు సాయంత్రం 4 గంటలకు విచారణ పిలవాలని జడ్జి సురేందర్ చెప్పారు.
ఇక ఈ రోజు కోర్ట్ లో CBI మరియు అవినాష్ రెడ్డి తరపున లాయర్ ల వాదనలు గట్టిగానే వినిపించాయి. రేపు సిబిఐ విచారణకు వెళ్లే ముందు కోర్ట్ అవినాష్ ముందస్తు బెయిల్ పిటీషన్ పైన తీర్పు రావాల్సి ఉంది. మరి ఏమి జరుగుతుందో చూడాలి.