లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితని కస్టడీకి ఇవ్వాలని సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ మీద రేస్ ఎవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది వాదనలు సందర్భంగా కవిత అరెస్టు మీద ఆమె తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి కీలక కామెంట్ చేశారు. కవితని అరెస్ట్ చేయడానికి అసలు ఇటువంటి కేసు లేదని సెక్షన్ 41 కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దుర్వినియోగం చేస్తుందని అన్నారు.
లిక్కర్స్ స్కామ్ కేసు కు సంబంధించి కవితకు వ్యతిరేకంగా సిబిఐ చెబుతున్న సాక్షాలకి విలువ లేదని అన్నారు కవిత అరెస్టు చట్ట విరుద్ధమని లిక్కర్ కేసులో ఆమె అరెస్టు రిమాండ్ ని కొట్టేయాలని అన్నారు కవిత అరెస్టు మీద ఇరు వర్గాల వాదనలు విన్న స్పెషల్ కోర్టు మరికాసేపట్లో సిబిఐ కస్టడీ పిటిషన్ మీద తీర్పు ఇవ్వనుంది.