కాంగ్రెస్, బీఆర్ఎస్ కి మధ్య ఎంఐఎం సంధి చేస్తోంది : ఎంపీ డా.కే.లక్ష్మణ్

-

కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు మధ్య ఎంఐఎం కుదిర్చే ప్రయత్నాలు చేస్తోందని బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ గెలవలేకే ఎంఐఎం ను గెలిపించడానికి సిద్ధం అయ్యిందని అన్నారు. ఓవైసీతో విభేదాలు ఉన్నప్పటికీ పార్టీ అధిష్టానం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు ఎంఐఎం ని గెలిపిస్తానని వాళ్ల పార్టీ నాయకుడే స్వయంగా వెల్లడించారని చెప్పారు.

మరోవైపు సీనియర్ నాయకులు వీ హనుమంతరావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి సపోర్టు చేసి మాట్లాడటం మా పార్టీలోని నాయకులకే నచ్చడం లేదని అంటున్నారని, అంటే మా పార్టీ వాళ్లు రేవంత్ రెడ్డితో విభేదిస్తున్నారని చెప్పుకనే చెబుతున్నారని విమర్శించారు. అందుకే రేవంత్ రెడ్డి నా మీద కుట్రలు పన్నుతున్నారని చెబుతూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తమకు అలాంటి ఉద్దేశం లేదని, ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తూ.. 5 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటున్నామని తెలిపారు. కానీ మీవాళ్లే మీ ప్రభుత్వాన్ని కూలగొడితే మాకు సంబందం లేదని, రానున్న ఎన్నికల్లో మోడీ తరహ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఇవ్వాళ రాష్ట్రంలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు సంధి కుదిర్చేందుకు ఎంఐఎం ప్రయత్నాలు చేస్తోందని, బీజేపీ ఢీ కొట్టలేక ఈ రహస్య కూటమి ఏర్పాటు చేసుకుంటున్నారని, ఎన్ని కుట్రలు పన్నినా మోడీ నాయకత్వాన్ని ప్రజలు మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news