కొత్త మెలిక పెట్టిన నిర్భయ దోషుల లాయర్…!

-

2012 లో జరిగిన నిర్భయ హంతకుల ఉరి శిక్షను రేపు ఉదయం 5;30 నిమిషాలకు తీహార్ జైల్లో అమలు చేయనున్నారు. ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మను రేపు ఉదయం ఉరి తీస్తారు. వారికి న్యాయ పరంగా రాజ్యాంగ పరంగా ఉన్న అన్ని అవకాశాలు దాదాపుగా పూర్తి అయ్యాయి. దీనితో వాళ్ళు శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం అంటూ ఎక్కడా లేదు.

అయితే ఇప్పుడు వాళ్ళు ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి గాను లాయర్ ఏపీ సింగ్ కొత్త ప్రతిపాదన తీసుకోచాడు. ఈ కేసులో నలుగురు దోషులు దేశ సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, వారిని భారత్ – పాకిస్తాన్ సరిహద్దులకు పంపాలని, లేకపోతే భారత్ – చైనా సరిహద్దు అయిన డోక్లాంకు పంపాలని కోరడం గమనార్హం. ఈ మేరకు తాను అఫిడవిట్ కూడా ఫైల్ చేస్తా అని చెప్పారు.

ఈ ప్రతిపాదనను కోర్ట్ అంగీకరించే పరిస్థితి కనపడటం లేదు. సుప్రీం కోర్ట్, ముఖేష్ సింగ్, పవన్ గుప్తా పిటీషన్ ని కొట్టేసిన సంగతి తెలిసిందే. వారి కుటుంబ సభ్యులు కూడా అనేక ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అయినా సరే వాళ్లకు ఉరి శిక్ష అమలు కావడం తద్యంగా కనపడుతుంది. మరి కొన్ని గంటల్లో వారిని తీహార్ జైల్లో ఉరి తీయనున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news