వ‌ర్మ అలా మార‌డం సంతోషాన్నిచ్చింది : ల‌క్ష్మీపార్వ‌తి

-

  • జ‌గ‌న్ గెలుపుకోసం కృషి చేస్తా

Laxmi Parvathi Visits Tirumala along with Ram Gopal Varmaఅమ‌రావ‌తి (తిరుమల): నాస్తికుడు, హేతువాది అయిన ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఎన్టీఆర్‌పై ఉన్న గౌరవంతో స్వామివారిని దర్శించుకుంటున్నానని వర్మ చెప్పడంతో ఈ చిత్రానికి పూర్తి న్యాయం జరుగుతుందన్న నమ్మకం వచ్చిందని లక్ష్మీ పార్వతి చెప్పారు. ఈ సినిమా కోసం ఆయన శ్రీవారిని దర్శనం చేసుకున్నారని, ఆ మార్పు తనకు సంతోషాన్ని ఇచ్చిందని ఆమె అన్నారు. వెంకటేశ్వర స్వామి కంటే ఎన్టీఆర్ అంటె ఎంతో భక్తి అని వర్మ చెప్పారని, ఆయనకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో శ్రీవారి దర్శనానికి వచ్చినట్లు చెప్పారని లక్ష్మీ పార్వతి తెలిపారు. ఈ సినిమాకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. లక్ష్మీ పార్వతి శుక్ర‌వారం ఉదయం తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లక్ష్మీ పార్వతి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తానని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. వైఎస్ జగన్ గెలుపుకోసం సర్వత్రా కృషి చేస్తానన్నారు.

వారిలో లేని ఆక‌ర్ష‌ణ లక్ష్మీపార్వ‌తిలో ఏముందని ఆశ్చ‌ర్య‌పోయా
అలనాటి నటీమణలు శ్రీదేవి, జయసుధ, జయప్రదలో లేని ఆకర్షణ… లక్ష్మీపార్వతిలో ఏముందని ఆశ్చర్యపోయానని రాంగోపాల్‌ వర్మ అన్నారు. అంతటి ఆకర్షణను కాదని…ఎన్టీఆర్‌ లక్ష్మీపార్వతిని పెళ్లిచేసుకోవడంపై సందిగ్ధంలో పడిపోయానని, ఆశ్చర్యపోయానని, అప్పుడు ఆ విషయం తన ఊహకు అందలేదని రాంగోపాల్‌ వర్మ మీడియాతో చెప్పారు. జనవరి 24న సినిమా విడుదల చేస్తున్నామని, స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్‌ తమ సినిమాకు ఆశీస్సులు అందిస్తారని వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు.

తిరుప‌తిలో పోస్ట‌ర్ల క‌ల‌క‌లం
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు మద్దతుగా తిరుపతిలోని శిల్పారామం వద్ద వైసీపీ పోస్టర్లు వెలిశాయి. సినిమా ముహూర్తం షాట్‌కు ఆహ్వానిస్తూ వైసీపీ ప్రముఖ నేతల ఫొటోలతో పోస్టర్లు ఏర్పాట్లు చేశారు. ఈ పోస్టర్లలో విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రోజాతో సహా ఇతర నేతలను చిత్రించారు.  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు మద్దతుగా ఇప్పుడు తిరుపతి నగరంలో వైసీపీ ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.
గతంలో హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్ హోటల్లో దర్శకుడు రాంగోపాల్ వర్మ, వైసీపీ అధినేత జగన్ బావ బ్రదర్ అనిల్ సమావేశమయ్యారు. అత్యంత రహస్యంగా జరిగిన ఈ సమావేశంలో జగన్ పెదనాన్న కుమారుడు వైఎస్ అనిల్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. వీరితో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత రాకేష్‌రెడ్డి కూడా ఉన్నారు. మామూలుగా వర్మ ఎవరితో సమావేశమయ్యారనేది పెద్ద విషయం కాదు. కానీ ఇప్పుడు వర్మ హాట్ టాపిక్. తెలుగువారి కీర్తి పతాకను ఎగురవేసిన ఎన్టీఆర్ జీవిత చరిత్రలో ఓ భాగాన్ని తెరమీదకు ఎక్కిస్తానని ఓ పోస్టర్ విడుదల చేసి వర్మ హాడావిడి చేశారు. ఈ సినిమాకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే పేరు పెట్టేశారు. వైసీపీ నేతను నిర్మాతగా ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news