వాహ్… వినిపించని పేషెంట్లకి సైన్ లాంగ్వేజ్ నేర్చుకుని ట్రీట్మెంట్ చేసిన నర్సు….!

-

కరోనా మహమ్మారి సమయం లో డాక్టర్లు నర్సులు ఎంత గానో శ్రమిస్తున్నారు. డాక్టర్లు, నర్సులు నిజంగా భగవంతుడుగా మారి ఎందరికో సహాయం అందిస్తున్నారు. పగలనక రాత్రనక పని చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారు. స్వాతి అనే ఒక నర్సు బిలాస్పూర్, ఛత్తీస్గఢ్ రైల్వే ఆసుపత్రి లో పని చేస్తున్నారు.

ఆమె కోవిడ్ వార్డ్ లో కరోనా పేషెంట్లు కి చికిత్స అందిస్తున్నారు. అయితే కొంత మంది పేషెంట్స్ కి వినిపించదు. అటువంటి పరిస్థితుల్లో ఆమె సైన్ లాంగ్వేజ్ నేర్చుకునే పేషెంట్ల తో కమ్యూనికేషన్ చేస్తున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. స్వాతి వినిపించని పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్లతో మాట్లాడలేను అని ముందు ఎంతగానో బాధ పడ్డారు. అందుకోసం ఆమె సైన్ లాంగ్వేజ్ నేర్చుకుని పేషెంట్ల తో మాట్లాడటం మొదలు పెట్టారు.

వాళ్ల సమస్యలను అర్థం చేసుకోవడం మంచి చికిత్స ఇవ్వడం మొదలుపెట్టారు. నిజంగా వినిపించిన పేషెంట్ల హృదయాలని ఆమె గెలుచుకున్నారు. అదే విధంగా రైల్వేస్ కూడా ఆమెను ప్రశంసించింది. రైల్వేస్ స్వాతి యొక్క వీడియో ని కూడా షేర్ చేయడం జరిగింది. నిజంగా ఇటువంటి వాళ్ళు ఎందరికో ఆదర్శం ఆమె చేసే పని నిజంగా చాలా గొప్పది అనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news