తెలంగాణాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఈ నెల 21 వరకు లాక్ డౌన్ అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి లాక్ డౌన్ అమలులోకి వస్తుంది. దీనితో హైదరాబాద్ లో నిత్యావసరాల కోసం ప్రజలు రోడ్ల మీద బారులు తీరుతున్నారు. వైన్ షాపుల వద్ద కూడా రద్దీ భారీగా ఉంది.
లాక్ డౌన్ తో కూరగాయల మార్కెట్ వద్ద కూడా రద్దీ ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే తెలంగాణ లాక్ డౌన్ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. పది రోజుల పాటు రిజిస్ట్రేషన్లు చేయవద్దని రిజిస్ట్రేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసారు. నేటి నుంచి 22వ తేదీ వరకు ఆదేశాలు అమలు కానున్నాయి.