లాఫింగ్ బుద్ధాను చైనా దేవుడు అని అంటారు.. ఆ విగ్రహం ఇంట్లో, వ్యాపార స్థలాల్లో ఉంచుతారు..అయితే వాస్తు ప్రకారంగా ఈ లాఫింగ్ బుద్దాను ఇంట్లో కొన్ని ప్రదేశాల్లో పెట్టుకోవడం వల్ల జీవితంలో అనేక సమస్యలు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు..లాఫింగ్ బుద్ధ ప్రాముఖ్యత చైనీస్ గ్రంధం అయిన ఫెంగ్ షుయ్ లో ఉన్నప్పటికీ దీని ప్రాముఖ్యత భారతీయ వాస్తు శాస్త్రంలో కూడా చెప్పబడింది.
వాస్తు ప్రకారం గా లాఫింగ్ బుద్ధ ను ఇంట్లో ఉంచడాన్ని శుభ ప్రదంగా పరిగణించడం పాటు, లాఫింగ్ బుద్ధాను వాస్తు ప్రకారం ఇంట్లో ఉంచడం ద్వారా సంపద శ్రేయస్సు లభిస్తుంది.అయితే, ఈ విగ్రహాన్ని ఇంట్లో వాస్తు ప్రకారం పెడితే మంచి లాభాలు పొందవచ్చు..ఇంతకీ ఈ విగ్రహాన్ని ఏ దిక్కున పెడితే మంచిదో వివరంగా తెలుసుకుందాం..విగ్రహాన్ని ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉంచాలని అంటున్నారు. అప్పుడు ఎటువంటి దిష్టి తగలదు.. మంచి ఫలితాలను పొందవచ్చు..
అదేవిధంగా భూమి నుంచి 30 అంగుళాలు లేదా గరిష్టంగా 32 అంగుళాల ఎత్తులో విగ్రహాన్ని ఉంచడం మంచిది. ఈ విధంగా చేయడం ద్వారా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి డబ్బులు ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఇక లాఫింగ్ బుద్ధను ఏయే ప్రదేశాలలో పెట్టకూడదు అన్న విషయానికి వస్తే వంట గదిలో, భోజనం తినే ఏరియాలో, పడక గదిలో, టాయిలెట్ లో ఈ లాఫింగ్ బుద్ధ అస్సలు పెట్టకూడదు. ఒకవేళ పెడితే మీ పని గోవిందా.. లేని పోనీ సమస్యలు రావడంతో పాటు చిల్లి గవ్వ కూడా ఉండదని నిపుణులు అంటున్నారు.