సిద్ధం అంటూ తాను చేసిన ట్వీట్ పై క్రికెటర్ అంబటి రాయుడు స్పష్టత ఇచ్చారు. ‘పవన్ అన్నను సీఎం చేయడానికి సిద్ధం. కలిసి సాధిద్దాం’ అని ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేశారు. కాగా తొలుత వైసీపీలో చేరిన అంబటి.. ఆ తర్వాత అకస్మాత్తుగా ఆ పార్టీని వీడి జనసేన అధినేతను కలిశారు. ఆ తర్వాత సిద్ధం అని ట్వీట్ చేయడంతో తిరిగి వైసీపీ గూటికి వెళ్తారనే ప్రచారం జరగ్గా.. తన ట్వీట్తో రాయుడు క్లారిటీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే… జనసేన పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది.అందులో పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుతో పాటు క్రికెటర్ అంబటి రాయుడు పేరు కూడా అంతే కాకుండా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్,మాజీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి,సినీ- టీవీ నటుడు ఆర్కే నాయుడు అలియాస్ సాగర్, జబర్దస్త్ హైపర్ ఆది, గెటప్ శ్రీను స్టార్ క్యాంపెనర్లుగా వ్యవహరించనున్నారు. రాయుడు జనసేనకి మద్దతిస్తుండటంతో ఆయన ఆ పార్టీలో చేరే అవకాశం ఉంది. దీంతో జనసైనికులు సైతం ఆయనను ఆహ్వానిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.