కోర్టు కెక్కిన ఎల్జీ పాలిమర్స్.. అమ్మేసుకుంటామని విజ్ఞాపన, సపోర్ట్ చేసిన ఏపీ ప్రభుత్వం !

-

తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎల్జీ పాలిమర్స్ ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. విష వాయువు విడుదల కావడంతో చాలా మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. ఇక తాజాగా ఎల్జీ పాలిమర్స్ హైకోర్టును ఆస్రయిన్సిహ్న్ది. కంపెనీలో ఉండిపోయిన రా మెటీరియల్ అమ్ముకోవాలని అందుకు అనుమతి ఇవ్వాలని ఎల్జీ పాలిమర్స్ కోరింది. ప్రమాదం జరిగిన నాటి నుండే కంపెనీ మూత పడిందని కంపెనీ ప్రతినిధులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

అయితే కంపెనీ మూత పడిన నాటి నుండి అందులో విలువైన రా మెటీరియల్ ఉండిపోయిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆ రా మెటీరియల్ అమ్మకానికి అనుమతులు ఇవ్వాలని ఎల్జీ పాలిమర్స్ కోరింది. వారు కోరిన దానికి ఏపీ ప్రభుత్వం మద్దతు తెలిపింది. ఆ మెటీరియల్ చాలా ప్రమాదకరం అని పేర్కొన్న ప్రభుత్వం, నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఏపీ సర్కార్ పేర్కొంది. దీంతో తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. 

Read more RELATED
Recommended to you

Latest news