LIC నుండి కొత్త పాలసీ… అర్హత, బెనిఫిట్స్ మొదలైన వివరాలు మీకోసం..!

-

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో సేవలను అందిస్తోంది. వీటి వలన చాలా మంది ప్రయోజనాలను పొందుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరో సరికొత్త జీవిత బీమా ప్లాన్‌ను తీసుకొచ్చారు. పూర్తి వివరాల లోకి వెళితే..

ధన్ వర్ష:

ధన్ వర్ష పేరుతో దీన్ని తీసుకు రావడం జరిగింది. క్లోజ్-ఎండెడ్ స్కీమ్ ఇది. రక్షణను, పొదుపును రెండింటిని ఈ స్కీమ్ ఇస్తుంది.

ధన్ వర్ష ప్రయోజనాలు:

గ్యారెంటీడ్ లంప్ సమ్ పేమెంట్‌ను ఇది అందిస్తోంది. ఒకవేళ కనుక పాలసీ టర్మ్‌లో మరణిస్తే వారి కుటుంబానికి నగదు సాయాన్ని ఇస్తుంది ఎల్ఐసీ. ఒకవేళ శాశ్వతంగా అంగవైకల్యం పొందితే అప్పుడు యాక్సిడెంట్ ప్రయోజనాల కింద అందించే మొత్తాన్ని పదేళ్ల పాటు నెలవారీ వాయిదాల్లో ఇస్తుందిట. అలానే ఈ పాలసీ నాన్ మెడికల్, మెడికల్ రెండు విధాలుగా మనకు ఉంటుంది.

ధన్ వర్ష పాలసీ టర్మ్:

ఈ ధన్ వర్ష పాలసీ టర్మ్ 10, 15 ఏళ్లుగా వుంది.

ఎవరు అర్హులు..?

ఇక ఎవరు అర్హులు అనేది చూస్తే.. కనీస వయసు 18 ఏళ్లు ఉండాలి. అలానే రూ.1,25,000కి పాలసీ తీసుకోవాలి. ఈ డబ్బులను ఒకేసారి చెల్లించాల్సి వుంది.

లోన్ సదుపాయం:

పాలసీపై లోన్ కూడా కావాలంటే పొందవచ్చు. పదేళ్ల పాలసీకి 70 శాతం, 60 శాతం లోన్ తీసుకోవచ్చు. 15 ఏళ్ల పాలసీకి 60 శాతం, 50 శాతం వరకు లోన్ ని తీసుకోవచ్చు. ఇలా ఈ పాలసీ ద్వారా లాభాలను పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news