LIC ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. చాలా మంది ఎల్‌ఐసి అందించే ప్రయోజనాలని పొందుతున్నారు. ఈ పథకాలలో డబ్బులు పెడితే మంచిగా ప్రయోజనం పొందొచ్చు. ఈ మధ్య కాలం లో చాలా మంది భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇలా స్కీమ్స్ లో డబ్బులని పెడితే చక్కగా భవిష్యత్తు లో ఏ బాధ లేకుండా ఉండచ్చు.
పైగా ఎటువంటి రిస్క్ కూడా దీనిలో ఇన్వెస్ట్ చేయడం వలన పొందొచ్చు. ఇదిలా ఉంటే ఎల్ఐసి త్వరలోనే ఆరోగ్య బీమా, సాధారణ బీమా పాలసీలను తీసుకు వస్తున్నట్టు తెలుస్తోంది. కాంపోజిట్ లైసెన్స్ పొందడానికి రెడీ గా వుంది భీమా దిగ్గజం ఎల్ఐసి. ఇది వరకు అన్ని రకాల బీమాలని కూడా అందించేది. కానీ ఒరియంటల్ ఇన్య్సూరెన్స్ కార్పోరేషన్ ప్రారంభించిన తర్వాత ఎల్ఐసి కేవలం జీవిత బీమా పాలసీలనే చేస్తోంది.
అయితే ఇప్పుడు ఎలైసి హెల్త్ ఇన్స్యూరెన్స్ తో పాటుగా జనరల్ ఇన్స్యూరెన్స్ ని కూడా ఇచ్చే సూచనలు కనపడుతున్నాయి. జనరల్ ఇన్య్పూరెన్స్ కు సంబంధించి అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పుడు వున్నాయి. అలానే కొన్ని ప్రయివేట్ సంస్థలు కూడా ఈ సేవలు ఇస్తున్నాయి. ఈరోజుల్లో హెల్త్ ఇన్య్సూరెన్స్ కు డిమాండ్ ఎక్కువగా వుంది. రోజు రోజుకి హెల్త్ ఇన్య్సూరెన్స్ ని తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది.