జీతంలోని కొత్త డబ్బులను సేవింగ్ చెయ్యడమో.. లేక ప్రభుత్వ పథకాలలో ఇన్వెస్ట్ చెయ్యాలని చాలా మంది అనుకుంటారు. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు ఇచ్చే వాటిలో భీమా పథకాలు కూడా ఒకటి..దేశంలోనే ఎల్‌ఐసీ అతిపెద్ద జీవిత బీమా సంస్థ అని చెప్పవచ్చు. ఇది అన్నివర్గాల వారికి అనుకూలమైన పాలసీలని రూపొందిస్తుంది. అందుకే ప్రజలు ఎక్కువగా ఎల్‌ఐసీని నమ్ముతారు. ఇందులో ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి మొగ్గుచూపుతారు. అంతేకాదు కొన్ని పాలసీలలో పన్ను ఆదా ఎంపికలు కూడా ఉంటాయి.
మీరు కూడా ఎల్ఐసీలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఎల్‌ఐసీ రెగ్యులర్ ప్రీమియం యూనిట్ లింక్డ్ ప్లాన్, SIIPలో పెట్టుబడి పెట్టవచ్చు . ఈ పథకంలో 21 సంవత్సరాల పాటు సంవత్సరానికి 40 వేల రూపాయలు డిపాజిట్ చేయాలి. మెచ్యూరిటీ తర్వాత మీకు మూడు రెట్లు అధికంగా డబ్బులను చెల్లిస్తారు..యసిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఈ ప్లాన్‌లో పెట్టుబడిదారుడు 21 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించాలి. ఇందులో మీరు ప్రీమియంను నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షికంగా చెల్లించవచ్చు..
అతను రూ.40000 లేదా రూ. 20000 పెట్టుబడి పెడితే నెలవారీ ఎంపికను ఎంచుకున్నప్పుడు ప్రతి నెలా 4000 ప్రీమియం చెల్లించాలి. గ్రేస్ పీరియడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. నెలవారీ రూ.4000 డిపాజిట్ చేయడం వల్ల మీ పెట్టుబడి రూ.10,08,000 అవుతుంది. 21 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీలో పెట్టుబడి పెట్టిన మొత్తం కాకుండా మీరు దాదాపు 35 లక్షల రూపాయలను పొందుతారు..
ఈ పథకం ద్వారా పెట్టుబడిదారులకు 4,80,000 బీమా రక్షణ కూడా ఉంటుంది. మీరు ఈ పాలసీని ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఆఫ్‌లైన్ పథకం ప్రయోజనాన్ని పొందడానికి ఏదైనా ఎల్ఐసి కార్యాలయానికి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.. ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు..