దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ బీమా కంపెనీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఎల్‌ఐసీ LIC గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా సరికొత్త పాలసీని ఒకటి తీసుకు రావడం జరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
తాజాగా తీసుకొచ్చిన ఈ పాలసీ పేరు ఎల్‌ఐసీ సరల్ పెన్షన్ స్కీమ్. జూలై 1 నుంచి ఈ పాలసీ అందుబాటులోకి రావడం జరిగింది. ఇది సింగిల్ ప్రీమియం ప్లాన్. అంటే ఒకేసారి డబ్బులు కట్టాల్సి ఉంటుంది. తర్వాత ప్రతి నెలా పెన్షన్ వస్తుంది.
ఇది ఇలా ఉంటే ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా కూడా ఈ పాలసీని కొనుగోలు చేసుకోవడానికి వీలవుతుంది. సరల్ పెన్షన్ స్కీమ్‌లో రెండు ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటి కోసం కూడా మనం ఇప్పుడు చూసేద్దాం.
మొదటి ఆప్షన్ లో అయితే పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం పెన్షన్ వస్తూనే ఉంటుంది. మరణించిన తర్వాత పాలసీ డబ్బులను ఒకేసారి నామినీకి చెల్లిస్తారు. అదే రెండవది అయితే పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం పెన్షన్ వస్తుంది. అదే పాలసీదారుడు మరణిస్తే భాగస్వామికి జీవితాంతం పెన్షన్ వస్తుంది. భాగస్వామి మరణిస్తే అప్పుడు పాలసీ డబ్బులు చెల్లిస్తారు. ఇలా ఇది వర్క్ అవుతుంది.
ఈ పాలసీని 40 నుంచి 80 ఏళ్లలోపు వయసు కలిగిన వారు తీసుకోవచ్చు. నెలకు కనీసం రూ.1000 పెన్షన్ వస్తుంది. మూడు నెలలకు రూ.3 వేలు. ఏడాదికి రూ.12 వేల పెన్షన్ తీసుకోవచ్చు. గరిష్ట పరిమితి లేదు.
ఆరు నెలల తర్వాత పాలసీపై లోన్ తీసుకోవడానికి వీలవుతుంది. 41 ఏళ్ల వయసులో ఉన్న వారు రూ.3 లక్షలు చెల్లించి ఈ పాలసీ తీసుకుంటే.. ప్రతి ఏడాది రూ.14760 పెన్షన్ లభిస్తుంది. అంటే ప్రతీ నెలా రూ.1195 వస్తుంది. నెలకు రూ.1000 పొందాలని భావిస్తే కనుక రూ.2.5 లక్షలు కట్టాలి.