Liger Movie Update: లైగ‌ర్ క్రేజీ అప్డేట్: ఇంటర్నేషనల్‌ స్టార్స్ కు బాల‌య్య డ‌బ్బింగ్

-

Liger Movie Update: టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ఆయ‌న‌ దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే జంట‌గా న‌టిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ.. ‘లైగర్’ (సాలా క్రాస్ బ్రీడ్). ఈ చిత్రాన్నిపూరి కనెక్ట్స్ బ్యానర్ మీద ఛార్మీ, పూరి కలిసి నిర్మిస్తుండగా.. బాలీవుడ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ స‌హా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.


భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతున్న ‘లైగర్‌’ మూవీలో ఇంటర్నేషనల్‌ బాక్సింగ్ స్టార్స్‌ ఛాంపియ‌న్ మైక్‌ టైసన్ న‌టించ‌నున్నారు. ఈ ఆంశం సర్వత్రా ఆసక్తి రేపుతుంది. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రంలో బాక్సింగ్‌ కింగ్‌ టైసన్‌ చేరికతో అది మరింత పెద్ద ప్రాజెక్ట్‌గా మారిపోయింది. అలాగే.. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో తెర‌కెక్కించ‌నున్నారు. అలాగే ఇత‌ర భాష‌ల్లోకి డ‌బ్ చేసి.. రిలీజ్ చేయ‌నున్నారు.

ఇదిలాఉంటే.. మ‌రో క్రేజీ అప్డేట్ వైర‌ల్ అవుతుంది. లైగ‌ర్ టీంలో నంద‌మూరి న‌ట‌సింహా బాల‌కృష్ణ కూడా చేరిన‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో మైక్‌ టైసన్‌, నందమూరి బాలకృష్ణ కలసి ప‌నిచేయబోతున్నార‌ట‌. కానీ ఒకేసారి కనిపించరు. కానీ ఈ మూవీలో వ‌ర్క్ చేస్తారట‌. అదెలా అనుకుంటున్నారు.

ఈ చిత్రంలో టైస‌న్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. హీరో విజయ్‌ దేవరకొండ సినిమాలో మైక్‌ టైసన్ ను ఆరాధించే వ్యక్తిగా కనిపిస్తాడట. టైసన్ ను స్పూర్తిగా తీసుకుని బాక్సింగ్ నేర్చుకుంటాడ‌ట‌. అయితే.. క్లైమాక్స్‌లో జరిగే మ్యాచ్‌లో మైక్ టైస‌న్ ముఖ్య అధితిగా వ‌చ్చి.. విజయ్‌ను స‌ర్‌ప్రైజ్ చేస్తారంట‌. ఈ క్ర‌మంలో విజ‌య్ , టైస‌న్ కు కొన్ని స‌న్నీవేశాలు చిత్రీక‌రించ‌నున్నారు.

అయితే.. టైస‌న్ పాత్ర‌కు .. బాలయ్య గాత్ర దానం చేయ‌బోతున్నదంట‌. టైస‌న్ పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్ప‌నున్నార‌ట‌. ఈ ఆంశంపై చ‌ర్చించ‌డానికే గ‌తంలో లైగ‌ర్ టీంను క‌లిసిన‌ట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే.. బాలయ్య తొలిసారి గళదానం చేసినవాడు అవుతాడు. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ఇటీవల ‘లైగర్‌’ టీమ్‌ బాలయ్యను కలవడానికి కారణం ఇదే అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news