ఏంటి కొత్తగా నెహ్రూ కుటుంబానికి కమలా కుటుంబానికి లింక్ ఏంటి అనుకుంటున్నారా.. అయితే లింక్ అయితే ఉంది కానీ కాకపోతే దూరపు బంధుత్వం దూరపు లింక్ అన్నమాట. కమల హారిస్ తాత పివి గోపాలన్ నెహ్రూ వద్ద జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. బ్రిటిష్ భారత దేశంలో ఇంపీరియల్ సెక్రటేరియట్ సర్వీస్ అనే విభాగంలో ఉద్యోగం చేయడం మొదలు పెట్టిన ఆయన ఆ తర్వాత దాన్ని సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ విభాగంలో క్లబ్ అయింది.
ఈయన మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ విభాగానికి సెక్రటరీగా చాలా ఏళ్ళు బాధ్యతలు నిర్వహించారు. ఈయనకు నలుగురు కూతుర్లు కాగా అందులో ఒకరు కమలా హారిస్ తల్ల శ్యామల. ఆయన తన కూతుర్ని బర్కిలీలో చదువు కోవటం కోసం పంపించారు అయితే అక్కడ జమైకా కి చెందిన వ్యక్తిని శ్యామల వివాహం చేసుకోగా వారికి కమల హ్యారిస్ జన్మించారు. అలా తన తాత ద్వారా నెహ్రూ ఫ్యామిలీకి కమలాకి లింక్ ఏర్పడింది అన్నమాట.