జాతి ఏదైనా, తల్లి ప్రేమ ఒక్కటే. అందుకు ఎటువంటి హద్దులు ఉండవు. అది మనిషి అయినా సరే, క్రూర మృగాలు అయినాసరే… అందరికీ సమానమే. మామూలుగా వన్యమృగాలను చూస్తే అవి మనల్ని చంపి చీల్చి తింటాయని భయపడ్డా, కానీ వాటికి కూడా ఏదైనా హాని జరిగితే బాధలే ఉంటాయి. అలాంటి సంఘటన ఒకటి తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఓ సింహం పిల్ల తన అమ్మకు దూరమవడంతో దానిని ఓ చింపాంజీ చేరదీసింది..
నిజానికి వారిద్దరి మధ్య ఎటువంటి సంబంధం కూడా లేదు. సింహం పిల్ల ఆకలితో ఉండటం గమనించిన చింపాంజీ తన జాతి వైవిధ్యాన్ని పక్కనపెట్టి, ఆకలి తీర్చడానికి మనసు ఉంటే సరిపోతుందని అనుకుందేమో పాపం ఆ చింపాంజీ. వెంటనే ఓ పాలడబ్బా తో ఆ సింహం పిల్లకు పాలు పట్టింది కూడా. ఇది దీనికి సంబంధించిన వీడియోను భారతదేశ ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నంద తన ట్విట్టర్ ద్వారా వీడియోని షేర్ చేశారు. ఇక ఆ వీడియోలో పాలు పాటిస్తూనే ఆ సింహం పిల్లకు తల నిమురుతూ నుదిటి మీద ముద్దు పెట్టడం కూడా మనం చూడవచ్చు. ఇక ఈ వీడియో కి సుశాంత్ నంద చివర్లో ” పెంపుడు తల్లి ముద్దు” అని క్యాప్షన్ ని కూడా జతచేశారు.