వేసవి వేడి వలన పెదవుల సమస్యలా..? అయితే వెంటనే ఇలా చేయండి..!

-

వేసవిలో ఎండలు తీవ్రంగా ఉంటాయి అలాంటప్పుడు రకరకాల సమస్యలు మనకి కలుగుతూ ఉంటాయి వేసవి కాలంలో వేడి కారణంగా చర్మ సమస్యలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. చర్మంపై దద్దుర్లు, మంట కలగడం, పెదాలకి ఇబ్బందిగా ఉండడం, పెదాలు పొడిబారిపోవడం కొన్ని కొన్ని సార్లు పెదాల మంట వలన చాలా మందికి పెదాల నుండి రక్తం కూడా వస్తుంది. పైగా పెదాలు ఆరిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు సరైన శ్రద్ధ పెట్టడం ముఖ్యం. ఒకవేళ అలా కాదు అంటే మరిన్ని ఇబ్బందులు వస్తాయి. కేవలం చలికాలంలోనే కాదు ఎండాకాలంలో కూడా చర్మంపై శ్రద్ధ పెట్టాలి ముఖ్యంగా పెదాలపై తప్పక శ్రద్ధ పెట్టాలి.

 

డిహైడ్రేషన్ వలన పెదాలకి ఇలా కలుగుతూ ఉంటుంది పెదాలు ఆరిపోకుండా హైడ్రేట్ గా ఉండటం చాలా ముఖ్యం. అయితే ఒకవేళ కనుక పెదాలకి ఇబ్బంది కలిగితే వేసవిలో ఈ చిన్న చిన్న ప్రయత్నం చేయండి. చర్మం పొడి బారిపోకుండా ఉండాలంటే వేసవిలో నీళ్లు లిక్విడ్స్ ని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి వీటిని తీసుకోవడం వలన సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు. అలానే లిప్ కేర్ రొటీన్ ని కూడా ఫాలో అవుతూ ఉండండి ముఖ్యంగా ఎండలో వెళ్లేటప్పుడు పెదాలకి లిప్ బామ్ రాసుకోవడం వంటివి చేస్తూ ఉండండి. పెదాల సమస్య నుండి ఇలా ఈజీగా బయటపడొచ్చు.

తేనె పెదాలకి సహాయం చేస్తుంది పెదాలు పొడిబారిపోయినా ఆరిపోయినా మంచి మాయిశ్చర్ లాగ తేనె పనిచేస్తుంది. ఈ సమస్య రాకుండా ఇది చూస్తుంది డెడ్ స్కిన్ ని తొలగిస్తుంది అలానే పెదాలు ఆరిపోకుండా చూస్తుంది. పెదాలపై తేనె రాసుకుని ఈ సమస్య నుండి బయటపడవచ్చు. పెట్రోలియం జల్దీ కూడా బాగా పనిచేస్తుంది. ఆయిల్, వ్యాక్స్ కంటే కూడా ఇది బాగా పనిచేస్తుంది పైగా తక్కువ ధరకే లభిస్తుంది సులభంగా సమస్య నుండి బయట పడొచ్చు. కొబ్బరి నూనె కూడా బెస్ట్ ఆప్షన్. కొబ్బరి నూనెని పెదాలకి రాస్తే ఆ సమస్యలు ఉండవు. యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఇందులో ఉంటాయి కొబ్బరి నూనె పెదాలపై రాస్తే రోజంతా కూడా పెదలకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలు ద్వారా సమస్య నుండి బయట పడొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news