కేఏ పాల్ కి సుప్రీంకోర్టులో చుక్కెదురు

-

తెలంగాణ నూతన సచివాలయంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంపై సిబిఐతో విచారణ జరిపించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును కేఏ పాల్ స్వయంగా వాదించారు. ఈ సందర్భంగా కేఏపాల్ దాఖలు చేసిన పిటిషన్ ని సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది.

సచివాలయ భవనంలో జరిగింది అగ్నిప్రమాదం కాదని.. నరబలి అని కేఏ పాల్ తన పిటీషన్ లో ఆరోపించారు. ఈ నేపథ్యంలో విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై సిబిఐతో ఎంక్వయిరీ వేయాలా..? ఈ ప్రమాదంపై ఎఫ్ఐఆర్ దాఖలు అయిందా..? అని ప్రశ్నించింది. అయితే తన జీవితానికి ముప్పు ఉందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు కేఏ పాల్. ఒక దానికి మరొక అంశాన్ని ముడి పెట్టొద్దని సుప్రీంకోర్టు పేర్కొంది. కేఏ పాల్ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news