డిసెంబర్ లో రూ.3459 కోట్ల మద్యం అమ్మకాలు..నిన్న ఒక్కరోజే.. రూ. 171 కోట్లు !

-

డిసెంబర్ మాసం లో భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ ఒకటి నుండి డిసెంబర్ 31 వరకు డిపోల నుండి 3 వేల 459 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గత ఏడాది (2020) డిసెంబర్ లో 2 వేల 764 కోట్ల 78 లక్షల మద్యం అమ్మకం జరుగగా ఈ సారి 3 వేల 459 కోట్లక్ చేరింది.

దీంతో గత డిసెంబర్ తో పోల్చుకుంటే ఈ డిసెంబర్ లో సుమారు 700 కోట్ల మద్యం అమ్మకాలు ఎక్కువ జరిగాయి. ఈ నెలలో 40 లక్షల 48 వేల కేసుల లిక్కర్, 34 లక్షల కేసుల బీర్లు అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 31న డిపోల నుండి అమ్మకాలు 171 కోట్ల 93 లక్షలు జరిగాయి. డిసెంబర్ ఒకటి నుండి అమలులోకి కొత్త మద్యం పాలసీ వచ్చిన నేపథ్యంలో మద్యం అమ్మకాలు భారీగా పెరగడం.. గమనార్హం.

కాగా నిన్న డిసెంబర్ 31 వేడుకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఈ వేడుకలు చాలా ప్రశాంతంగా జరగడం గమనార్హం. గతంలో కంటే ఈసారి వేడుకలను చాలా ప్రశాంతంగా నిర్వహించేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news