ప్రస్తుతం కరోనా మహమ్మారి కేసులు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. మొన్నటి వరకు పది వేల లోపు నమోదు అయిన కరోనా మహమ్మారి కేసులు ఇప్పుడు ఇరవై వేలకు పైగా నమోదుకావడం ఆందోళనకరమైన విషయం. ఇక అటు చిత్ర పరిశ్రమను ఈ కరోనా మహమ్మారి కుదిపేస్తోంది.
ఇప్పటికే టాలీవుడ్ హీరోలు మంచు మనోజ్, విశ్వక్ సేన్ , తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ ఇలా చాలా మంది ప్రముఖులు కరువు బారిన పడ్డారు. ఇక తాజాగా బాలీవుడ్ జెర్సీ మూవీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కరోనా సోకింది. అది కూడా మృణాల్ ఠాకూర్ ఓమీ క్రాన్ వేరియంట్ సోకినట్లు సమాచారం అందుతోంది. అయితే ప్రస్తుతం ఈ హీరోయిన్ ఐసోలేషన్ లో ఉందని తెలుస్తోంది. వైద్యుల పర్యవేక్షణ లో ఆమెకు కరోనా చికిత్స అందిస్తున్నారు.కాగా ఈ కరోనా మహమ్మారి కారణంగా మరోసారి థియేటర్లు మూత పడుతున్నాయి. దీంతో సినిమాలు వీడియో చేసేందుకు నిర్మాతలు భయపడుతున్నారు.