రామమందిరం భూమి పూజ.. అద్వానీ, జోషీలకు అందని ఆహ్వానం..! ఎందుకో తెలుసా..?

-

ఆగస్టు 5న ప్రధాని మోడి అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. అందుకోసం ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కరోనా నేపథ్యంలో ఎక్కువ మందిని ఆహ్వానించకూడదని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిర్ణయించింది. కేవలం 150 మంది అతిథులు సహా 200 మంది మాత్రమే కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించింది. అయితే బీజేపీ కురువృద్ధులు, రామ మందిర ఉద్యమంలో కీలక  పాత్ర పోషించిన అద్వానీ, మురళీ మనోహన్ జోషిలకు ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందలేదు.

కరోనా నేపథ్యంలో వీరిద్దరి వయసు దృష్టిలో ఉంచుకుని ఆహ్వానించలేదని చెబుతున్నప్పటికీ స్పష్టత రావలసి ఉంది. మరోపక్క, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ లకు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా ఉమాభారతి, కల్యాణ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, 1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన గురించి తాము ఏమాత్రం చింతించమని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news