ఆధార్ కార్డు పోతే ముందు ఇలా చెయ్యండి…!

-

ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైన డాక్యుమెంట్ ఓ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలని అనుకుంటే కూడా ఆధార్ కార్డు అవసరం. ఇలా ఏ విదంగా చూసుకున్న ఆధార్ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే. అలాగే ఆధార్ ఐడెంటిటీ కార్డుగా పని చేస్తుంది. ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయొచ్చు.

అయితే ఆధార్ అన్నింటి కూడా ఎంతో అవసరం. ఒకవేళ కనుక పొరపాటున మీరు మీ ఆధార్ ని పొగొట్టుకుంటే ముందు ఇలా చెయ్యండి. దాని వలన మీ ఆధార్‌ను దుర్వినియోగం కాకుండా ఉండడానికి వీలవుతుంది.

ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…. ఆధార్ కార్డుని ఎప్పుడైనా పోగొట్టుకుంటే వెంటనే ఆధార్ లాక్ చేసుకోవడానికి మీరు యూఐడీఏఐ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడ మై ఆధార్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో ఆధార్ సర్వీసెస్ అని ఉంటుంది. ఇలా అక్కడ లాక్, అన్‌లాక్ బయోమెట్రిక్స్ ఆప్షన్ ఎంచుకోవాలి.

ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేయాలి. ఆ తరువాత సెండ్ ఓటీపీ అని ఉంటుంది దాని మీద క్లిక్ చెయ్యండి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేస్తే మీ ఆధార్ బయోమెట్రిక్స్ లాక్ అవుతాయి. ఇలా మీరు ఈజీగా బయోమెట్రిక్స్‌ను లాక్, అన్‌లాక్ చెయ్యచ్చు. అలానే మీరు కావాలంటే ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఈ పని చెయ్యవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news