కర్నూలు జిల్లాలో దిశ తరహా ఘటన.. యువతిపై పెట్రోల్ పోసి !

కర్నూలు జిల్లాలో  దారుణం జరిగింది. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు దుండగులు. బనగానపల్లె మండలం యాగంటిపల్లె సమీపంలో గాలేరు నగరి కాలువలో ఈ ఘటన జరిగింది. తెలంగాణ  నారాయణపేట జిల్లా మర్రి కెళ్ళ  మండలం , రాకొండకు చెందిన యువతిగా గుర్తించారు పోలీసులు. గాలేరు-నగరి కాలువ సిమెంట్ కాంక్రీట్  పనులకు తల్లిదండ్రులతో కలిసి  మృతురాలు  వచ్చినట్టు చెబుతున్నారు.  యువతిపై అత్యాచారం చేసి హత్య చేసి పెట్రోల్ పోసి తగుల పెట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలోని నారాయణ్‌పేట జిల్లా మరికల్‌ మండలం రాకొండకు చెందిన కొందరు జీఎన్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కాల్వ లైనింగ్‌ పనుల కోసం వచ్చారు. బాలిక తండ్రి ఉదయం పనులు చేసేందుకు వెళ్లారు. ఆ పక్కనే ఉన్న తాత్కాలిక షెడ్ల దగ్గర కుమార్తె ఉంది. సాయంత్రం ఇంటికి వచ్చిన తండ్రి.. షెడ్‌ పక్కన కుమార్తె మంటల్లో కాలిపోయి ఉండటాన్ని గమనించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాలికపై ఎవరైనా అత్యాచారం చేసి.. డీజల్‌ పోసి నిప్పటించి హత్య చేశారా.. బాలిక ఆత్మహత్య చేసుకుందా అనే వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.