ఏపీ సెక్రటేరియట్ లో కరోనా మరణ మృదంగం.. మరో ఉద్యోగి మృతి !

ఏపీ సెక్రటేరియట్ లో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. అమరావతి సచివాలయంలో మరో ఉద్యోగి కరోనాతో మృతి చెందారు. లేబర్ డిపార్ట్మెంట్ ఎస్ఓ శరత్ చంద్ర అజయ్ బాబు కరోనా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇప్పటికే కరోనాతో ఐదుగురు ఉద్యోగుల మృత్యువాత పడ్డారు. దీంతో సచివాలయ ఉద్యోగులు ఆందోళనలో మునిగిపోయారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వర్క్ ఫ్రం హోంకు అనుమతి ఇవ్వాలని ఉద్యోగుల డిమాండ్ చేస్తున్నారు. ఇక కోవిడ్ నియంత్రణ పై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించడానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ సిద్దం అవుతున్నారు.  కోవిడ్ మంత్రి వర్గ ఉప సంఘం, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. సాయంత్రం మూడు గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు.