తెలంగాణాలో నేటి నుంచి లాక్ డౌన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నేటి నుంచి ఈ నెల 21 వరకు అంటే పది రోజుల పాటు తెలంగాణాలో లాక్ డౌన్ అమలులో ఉంటుంది అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. అంటే రోజులో 20 గంటల పాటు లాక్ డౌన్ అమలు చేస్తారు.
వైన్ షాపులతో పాటుగా అన్ని రకాల కొనుగోళ్ళు ఈ సమయంలో అందుబాటులో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక వాక్సినేషన్ కార్యక్రమం మాత్రం ఆగేది లేదు అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టీకా కోసం వెళ్ళే వారికి అత్యవసర సర్వీసులకు మాత్రం అనుమతి ఉంటుంది. ఇతర కార్యాకలాపలకు సంబంధించి ఉదయం 10 గంటల వరకే అమలులో ఉంటుంది.