తన ప్లాస్మాతో గర్భవతి ప్రాణాలు నిలబెట్టిన పోలీస్…!

కరోనా చికిత్సలో ప్లాస్మా కీలక పాత్ర పోషిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అందుకే ప్లాస్మా దానానికి సంబంధించి ఎవరికి వారుగా సూచనలు సలహాలు ఇస్తున్నారు. ప్లాస్మా విషయంలో ప్రజలు కూడా స్వచ్చందంగా ముందుకు వస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఒక పోలీస్ గర్భవతి ప్రాణాలను నిలబెట్టారు. ఢిల్లీ పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ ఆకాశ్‌దీప్… 21 వారాల గర్భవతికి పాస్మా దానం చేసారు.

మహిళకు ప్లాస్మా దానం చేసి రెండు ప్రాణాలను కాపాడాడు. 27 ఏళ్ల మహిళ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే స్పందించిన పోలీస్ అధికారి ఆమెకు ప్లాస్మా దానం చేసారు. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపధ్యంలో ఢిల్లీ పోలీసులు ప్లాస్మా దాతల కోసం డిజిటల్ డేటా బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు.