మాయదారి కరోనా వల్ల మళ్లీ లాక్‌డౌన్ మొదలు పెట్టాలని చూస్తున్న రాష్ట్రాల్లో, పరిస్దితులు చేయి దాటిపోతుండటంతో మొట్టమొదటగా తమిళనాడు లాక్‌డౌన్ విధించడానికి వెనుకాడటం లేదు.. ఒక తమిళనాడు అని ఏం లేదు.. మనదేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ఆందోళన చెందుతున్న ప్రభుత్వాలు కరోనా కట్టడికి మొగ్గుచూపుతున్నాయి..
ఇకపోతే ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య తమిళనాడులో విపరీతంగా పెరుగుతుండటంతో గ్రేటర్ చెన్నై, చెంగల్పట్టు, తిరువల్లూర్, కాంచీపురం జిల్లాల్లో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ విధించనున్నామని అధికారులు తెలుపుతున్నారు.. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆటోలు, టాక్సీలు, ప్రైవేట్ వాహనాలను అనుమతించమని, కేవలం ఎమర్జెన్సీ ఐతే తప్ప ప్రైవేట్ వాహనాలను అనుమతి ఉండదని పేర్కొంటున్నారు..
ఇక ఈ లాక్‌డౌన్ ఈనెల 19 నుంచి 30 వరకూ అమల్లో ఉంటుందని తెలుపుతున్నారు.. ఇకపోతే లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు మరింత కఠినతరం చేయాలని పళని స్వామి సర్కారు నిర్ణయించడమే కాకుండా సడలింపులను కూడా రద్దు చేయనున్నారు. అవేమంటే ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే నిత్యావసరాల ఖరీదుకు అవకాశం ఇస్తున్నారు. కాగా హోటళ్లు, రెస్టారెంట్లలో పార్సిళ్లకు మాత్రమే అనుమతిస్తున్నారు.. ఈ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడానికి కూడ వెనుకాడం అని హెచ్చరిస్తున్నారు..