దేశంలో లాక్ డౌన్ పెంపు… మరో 14 రోజులు…!

-

దేశంలో లాక్ డౌన్ ని పొడిగించే అవకాశాలు ఉన్నాయా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు ఒక్కసారిగా పెరగడం చూసి అందరూ షాక్ అయ్యారు. ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఊహించని పరిణామం తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి అనేది అర్ధమవుతుంది. ఇప్పుడు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి నుంచి కేసులు పెరిగాయి.

వారి కారణంగా కరోనా కేసుల సంఖ్య అనేది ఎక్కువగా పెరుగుతుంది. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 4289 కేసులు నమోదయ్యాయి. అందులో 118 మంది మరణించారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారికి ఎంత మందికి కరోనా సోకింది, వాళ్ళ నుంచి అది ఎంత మందికి సోకింది…? ఇప్పుడు వదిలేస్తే మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లాక్ డౌన్ ని పొడిగించాలని ఇప్పుడు అన్ని రాష్ట్రాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాయి.

లాక్‌డౌన్‌ ముగియడానికి సమయం చాలా తక్కువగా ఉండగా ఆ లోపు కేసుల సంఖ్య తగ్గితే తగ్గినట్టు లేకపోతే మాత్రం లాక్ డౌన్ ని పొడిగించడం మినహా మరొక లాభం లేదు. ఇప్పటికే రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సహా కేంద్ర ప్రభుత్వం మూడు నెలల కార్యాచరణ అనేది ప్రకటించింది. మరో 15 రోజులు అంటే.. ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగించే ఛాన్స్ ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. లాక్ డౌన్ కి ప్రజలు కూడా మద్దతు ఇవ్వడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news