Lok sabha : మరోసారి తెరమీదకి దేశం పేరు మార్పు….

-

గతేడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన ‘జీ20 సదస్సు’ సమయంలో దేశం పేరు మార్పుపై ఎంత రచ్చ జరిగిందో మన అందరికీ తెలిసిందే.దాదాపు ప్రతిచోటా ఇండియాకి బదులు ‘భారత్’ పేరుని మార్చాలని అందరూ తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.అదే సమయంలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు కూడా నిర్వహించడంతో.. బహుశా దేశం పేరు మార్పుపై తీర్మానం చేయొచ్చన్న వాదనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు దేశం పేరు మార్పుకి మద్దతిస్తే.. మరికొందరు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు.

 

చివరికి దేశం పేరుని భారత్‌గా మార్చలేదని తేలిపోవడంతో, ఈ టాపిక్ డైవర్ట్ అయింది.  ఇప్పుడు ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దేశం పేరుని భారత్‌గా మార్చాలని సోమవారం లోక్‌సభలో బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సత్యపాల్‌ సింగ్‌ ఈ డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోని మొదటి పేరాలో ‘ఇండియా’ అంటే ‘భారత్’ అన్న ప్రస్తావన ఉందని.. ఇండియా అనే పదానికి స్వస్తి పలికి దేశం పేరుని ‘భారత్’గా మార్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు.మన భారత్ విజ్ఞాన శక్తికి కేంద్రంగా ఉందని ,ప్రపంచంలోనే ఎంతో గొప్పదైన మన దేశం పేరుని ‘భారత్’గా మార్చాలని కోరారు.భారతదేశంలో జన్మించడం తమ అదృష్టమని దేవతలే చెప్పారని.. కాబట్టి దేశం పేరును భారత్‌గా మార్చాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news