ఉదయం 9 గంటల వరకు ఆయా రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్ శాతం ఇదే

-

దేశంలో సార్వత్రిక ఎన్నికల మొదటి విడత పోలింగ్ కొనసాగుతోంది. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఈ విడతలో మొత్తం 1600 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా 16కోట్ల 63 లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మరోవైపు పలువురు ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఉదయం తొమ్మిది గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం వెల్లడించింది. 9 గంటల వరకు తమిళనాడులో 8.21 శాతం, త్రిపురలో 15.21, ఉత్తర్‌ప్రదేశ్‌లో 12.66, ఉత్తరాఖండ్‌లో 10.54, బంగాల్‌లో 15.09 ఓటింగ్ శాతం నమోదైనట్లు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో 12.02, బిహార్‌లో 9.23, అసోంలో 11.15, అరుణాచల్‌ప్రదేశ్‌లో 5.98, అండమాన్ నికోబార్ దీవుల్లో 8.64 శాతం నమోదైనట్లు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న అరుణాచల్‌ప్రదేశ్‌లో 6.44, సిక్కింలో 7.90 శాతం ఓటింగ్ నమోదైనట్లు చెప్పారు. మరోవైపు ఓటింగ్ లో పాల్గొనేందుకు ఎండలోనూ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతున్నారు. ఓటర్లకు అసౌకర్యం కలగకుండా పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news