ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ…మంగళగిరిలో 12 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు నారా లోకేష్. ఈ విషయాన్ని నారా లోకేష్ స్వయంగా చెప్పారు. నిన్న మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ పర్యటించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
మంగళగిరి పట్టణంలో పర్యటించాను. గెలిచిన ఎమ్మెల్యే రియల్టర్లతో చేతులు కలిపి కోట్లు కమీషన్ తీసుకుని పేదల ఇళ్లు పడగొట్టిస్తున్నాడు. ఓడిపోయిన నేను నియోజకవర్గంలో ప్రజల కోసం 12 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాను. నా దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరిస్తున్నాను. నేను గెలిచిన ఏడాదిలోగా కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న వారందరికీ అటవీశాఖ భూములు డీ నోటిఫై చేయించి బట్టలు పెట్టి మరీ పట్టాలు ఇస్తాను. సమస్యలు శాశ్వతప్రాతిపదికన పరిష్కరిస్తానన్నారు లోకేష్.
ప్రభుత్వ అరాచక పాలనపై విసుగెత్తిన ప్రజలు మంగళగిరి పర్యటనలో నా ముందు సమస్యలు ఏకరువు పెట్టారు. సామాన్యులే కాదు..వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా సర్కారు తీరుపై మండిపడుతున్నారు. జగన్ రెడ్డి చెత్త పాలనపై విసిగి వేసారిన మంగళగిరి టౌన్ 5,6 వార్డులకు చెందిన 80 వైసిపి కుటుంబాలు నా సమక్షంలో టిడిపిలో చేరాయి. ఏకలవ్య గిరిజన సేవా సంఘం అధ్యక్షుడు ఇట్టా శివ ప్రసాద్, వైసిపి నేత తోట గౌరీ శంకర్ లకు పసుపు కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించానని పేర్కొన్నారు.