అల్లు అర్జున్ చేసిన పనికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్..

-

తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్ పేరు అందరికి తెలుసు..సినిమాల్లో హీరోగా మాత్రమే కాదు..నిజ జీవితంలో కూడా హీరోనే..తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇబ్బందులలో ఉంటే వారికి సాయం చెయ్యడంలో వెనకడుగు వెయ్యడు.ఇప్పటికే ఎందరికో సాయాన్ని అందించారు..తాజాగా మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. అల్లు అర్జున్. కష్టాల్లో ఉన్న వారికి ఉదారంగా సాయం చేస్తూ అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటూనే ఉంటున్నారు. ఇక ఇప్పటికే కేరళలో ఓ పేద విద్యార్థి చదువుకు సాయం చేసిన బన్నీ పై అందరు ప్రశంసలు కురిపించారు..స్వయంగా కలెక్టర్ బన్నీకి కృతజ్ఞతలు తెలిపారు… తాజాగా తన డ్రైవర్‌ను కూడా ఆదుకున్నారు.

అల్లు అర్జున తన దగ్గర 10ఏళ్లుగా పనిచేస్తున్న డ్రైవర్‌ ఓ .మహిపాల్‌ ఇల్లు నిర్మించుకోవడానికి 15లక్షలు రూపాయలు బహమతిగా ఇచ్చాడు. వరంగల్‌కు చెందిన ఓ మహిపాల్‌ 10ఏళ్లుగా అల్లు అర్జున్‌ వ్యక్తిగత డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌ బోరబండలో నివాసం ఉంటున్న మహిపాల్‌ ఇటీవలే ఇల్లు నిర్మాణం మొదలుపెట్టాడు..

ఆ విషయం తెలుసుకున్న వెంటనే ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్నాడు..మొత్తం 15లక్షల రూపాయలు మహిపాల్‌కు చెక్కుల ద్వారా ఇచ్చాడు. 10లక్షల చెక్కు ఒకసారి, 5లక్షల చెక్కు ఒకసారి ఇచ్చాడు. అల్లు అర్జున్‌, భార్య స్నేహరెడ్డి ఇద్దరు జాయింట్‌ అకౌంట్‌ నుంచి 15లక్షలు అందించి మంచి మనసును చాటుకున్నాడు.. ఇక సినిమాల విషయానికొస్తే.. పుష్ప 2 లో రష్మిక మందన్న హీరోయిన్గా నటించగా,సుకుమార్ రూపొందిస్తున్నారు . వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news