మీ పక్కన వారికి కరోనా ఉంటే చెప్పేసే యాప్…!

-

కరోనా మన చుట్టూ ఉన్న వాళ్లకు ఉందా లేదా అని తెలుసుకోవడం సాధ్యం కాదు. మన పక్కన ఉన్న వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నా సరే వారి ఆరోగ్యం ఎప్పుడు మారుతుందో తెలియదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనాకు జనం బలవడానికి ప్రధాన కారణం పక్కని వారికి కరోనా ఉందని తెలియకపోవడమే. దీనితో ఇప్పుడు శాస్త్రవేత్తలు పరిశోధనలు ముమ్మరం చేస్తున్నారు. పరీక్ష చేస్తే మినహా ఉందో లేదో అర్ధం కానీ పరిస్థితి.

ఈ తరుణంలో లండన్ లో ఒక యాప్ తయారు చేసారు. మనం ఎక్కడ ఉన్నా సరే మన పక్కన కరోనా రోగులు ఉంటే మనను అప్రమత్తం చేస్తుంది సదరు యాప్. దీనిని యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌, స్విస్‌ ఫెడరల్‌ ఇన్‌స్టిట్యూట్‌, కేయూ ల్యూవెన్‌ వర్సిటీ(బెల్జియం) శాస్త్రవేత్తల సంయుక్త బృందం తయారు చేసింది. ఇప్పటి వరకు మనకు అందుబాటులో ఉన్న యాప్స్ అన్నీ లొకేషన్ ఆధారంగా పని చేస్తే ఇది కేవలం బ్లూ టూత్ ఆధారంగా పని చేస్తుంది.

దీనిపై శాస్త్రవేత్తలు ఒక ప్రకటన చేసారు. ఈ యాప్ ని ఉపగించే వారి సమాచారానికి ఏ విధమైన ఇబ్బందులు ఉండవని చెప్తున్నారు. కేవలం వారి కదలిక మాత్రమే ఈ యాప్ కనిపెట్టి అప్రమత్తం చేస్తుందని అంతే గాని ఏ ఇబ్బందులు ఉండవు అని చెప్తున్నారు. దీనిని అందరూ ధైర్యంగా వాడుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 15 లక్షలకు చేరువలో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news