ఈరోజు ప్రపంచ మత్స్య దినోత్సవం. ఈ మత్స్య దినోత్సవం సందర్భంగా నాలుగు హార్బర్ లకు ఏపీ సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. తొలి దశలో నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం హార్బర్ లకు ఈ రోజు వర్చువల్ పద్ధతిలో సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. 1510 పది రూపాయల కోట్ల నిధులతో నాలుగు హార్బర్ నిర్మాణం చేపట్టనున్నారు, దీనికి ఆక్వా హబ్ అని పేరు పెట్టారు. ఇక నియోజకవర్గానికి ఒక ఆక్వా హబ్ నిర్మాణం జరుగుతుందని చెబుతున్నారు.
ఇక మరో నాలుగు చోట్ల కూడా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తన పాదయాత్ర సమయంలో మత్స్యకారుల సమస్యలను పరిశీలించిన సీఎం జగన్ వారి ఇబ్బందులను తొలగించేందుకు ఈ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రెండోదశలో శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఏర్పాటు కానున్నాయి. మొత్తం 8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ప్రభుత్వం సుమారు రూ.3 వేల కోట్లు వెచ్చిస్తోంది.