ఏపీ విద్యా వ్యవస్థలో ఎన్ని మార్పులో..!

-

దేశ ఆర్ధిక రంగం మీద, ప్రజా జీవితం మీద, విద్యార్ధుల కెరీర్ మీద కరోనా వేసిన మార్కు అంతా ఇంతా కాదు. ప్రజా జీవనంలో కరోనా పెను మార్పులే తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇటు ప్రకృతిని కాలుష్య కోరళ్లోంచి తప్పించిన కరోనా అటు ఓజోన్ పొర రక్షణకు కారణమైన కరోనా… తాజాగా విద్యార్థుల జీవితాల్లో కూడా పెను మార్పులే తీసుకువచ్చింది. ఈ విషయంలొ ఏపీ విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్, సెలవులు, పరీక్షల విధానం వంటి కీలక అంశాల్లో పెను మార్పులు చేయబోతోంది!

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖకు సంబంధించి 2020-21 విద్యా సంవత్సర అకడమిక్‌ క్యాలెండర్‌ లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోందనే చెప్పాలి. సాధారణంగా వేసవి సెలవుల అనంతరం జూన్‌ 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, కొత్త విద్యాసంవత్సరంపై లాక్‌ డౌన్‌ పొడిగింపు ప్రభావం పడుతున్న నేపథ్యంలో… కొత్త విద్యా సంవత్సరం జూన్ నుంచి కాకుండా… ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి ప్రారంభించి 2021 జూలై 31 వరకు ఉండేలా అకడమిక్‌ క్యాలెండర్‌ రూపొందించాలని ఏపీ విద్యాశాఖాధికారులు భావిస్తున్నారట.

అన్నీ అనుకూలంగా జరిగితే… మే 17 అనంతరం లాక్‌ డౌన్‌ ఎత్తేసిన తర్వాత సుమారు 2 వారాలకు పదో తరగతి పరీక్షలను నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ భావిస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫార్మేటివ్‌ అసె్‌సమెంట్‌, సమ్మేటివ్‌ అసె్‌సమెంట్‌ పరీక్షలలోనూ పలు మార్పులు ఉండవచ్చని అంటున్నారు. ప్రతీ ఏడాది లాగా… నాలుగు యూనిట్ టెస్టులు, ఒక క్వార్టర్లీ, ఒక హాల్ఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్ … ఇలా ఇన్నేసి పరీక్షలు పెట్టకుండా… ప్రతి క్వార్టర్‌ కు ఒకసారి మాత్రమే పరీక్షలు నిర్వహించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇక సెలవుల విషయానికొస్తే…. దసరా, సంక్రాంతి సెలవులను సైతం కుదించే అంశాన్ని కూడా ఏపీ విద్యాశాఖ పరిశీలిస్తున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news