ఆర్టీసి బస్సులు నడుస్తాయా…? కేసీఆర్ ఆలోచన ఏంటీ…?

-

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని కేంద్ర సర్కార్ పెంచిన సంగతి తెలిసిందే. రెండు వారాలు అంటే మే 17 వరకు లాక్ డౌన్ ని కేంద్రం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి తోడు లాక్ డౌన్ లో గ్రీన్ ఆరెంజ్ జోన్స్ కి కొన్ని మినహాయింపులు ఇచ్చింది కేంద్ర సర్కార్. ఈ నేపధ్యంలోనే వైన్ షాపులను, ఆర్టీసి బస్సులను నడుపుకునే అవకాశాన్ని ఇచ్చింది. దీని ద్వారా ఆర్ధిక కష్టాల నుంచి బయటపడే ఆలోచన చేసింది.

ఈ తరుణంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఆర్టీసి సర్వీసులను నడిపితే సామాజిక దూరం సాధ్యం కాదు కాబట్టి కరోనా వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ కేసీఆర్ ఒక ఆలోచనలో ఉన్నారు. గ్రీన్ జోన్ ప్రాంతం ఏది అయితే ఉందో ఆ పరిధిలో మాత్రమే బస్సులు నడపాలి… ఆరెంజ్ జోన్ నుంచి గ్రీన్ జోన్ కి బస్సులు వెళ్ళడానికి వీలు లేదు.

ఉదాహరణకు ఒక జిల్లాలో 20 మండలాలు ఉన్నాయి అనుకుందాం… 2 మండలాల్లో మాత్రమే కేసులు ఉన్నాయి. కాబట్టి ఆ రెండు మండలాలను మినహాయించి బస్సులు నడపాలి. కేసులు ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా మూసి వెయ్యాల్సి ఉంటుంది. ఆరెంజ్ జోన్ లో కేసులు కొత్తగా నమోదు కాకపోతే 28 రోజులు ఆగిన తర్వాత బస్సులకు అనుమతి ఇవ్వాలి. ఆరెంజ్ జోన్ కి సంబంధించి ఎవరు అయినా చికిత్స పొందుతున్నా సరే బస్సులను ఆరెంజ్ జోన్ లో అనుమతించే అవకాశం ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news