‘లవ్ జీహాద్’ చట్టాన్ని సవరిస్తామంటున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి

-

5 రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపొందేందుకు అన్ని పార్టీలు ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నాయి. యువతకు ఉద్యోగాలు, మహిళలకు రక్షణ, ల్యాప్ టాప్ లు, ఉచితంగా పెట్రోల్ ఇలా తమ ఓటర్ ను ప్రసన్నం చేసుకునేందుకు వినూత్న హామీలను ఇస్తున్నాయి.

తాజాగా బీజేపీ నేత, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సంచలన హామీ ఇచ్చారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షకు తగ్గకుండా.. ‘లవ్ జీహాద్’ బిల్లుకు సవరణలు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. యువతకు 50,000 ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. పేదలకు ఏడాదిలో 3 ఉచిత LPG సిలిండర్లు అందిస్తామని..కొండ ప్రాంతాల్లో నివసించే గర్భిణులకు రూ.40 వేలు అందజేస్తామన్నారు. సీనియర్ సిటిజన్ల పెన్షన్ రూ.3600కి పెంచుతామని పుష్కర్ సింగ్ దామి హామీలు ఇచ్చారు. ఈనెలలో ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. రేపు యూపీలో తొలివిడత ఎన్నికలు జరుగనున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news