టాలీవుడ్ కు గుడ్ న్యూస్.. ఏపీలో కొత్త టికెట్ల ధరలు ఫిక్స్ !

-

అమరావతి : కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి జగన్ తో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని భేటి అయ్యారు. రేపు మెగాస్టార్ చిరంజీవి, సినీ పెద్దలతో సీఎమ్ భేటీ నేపథ్యంలో వారు కీలక చర్చ నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పటికే దాదాపుగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది ప్రభుత్వం టికెట్ల కమిటి. రేపటి భేటీ అనంతరం కమిటి సిఫార్సుల్లో మార్పులు చేర్పులు చేసి తుది నివేదిక ఇచ్చే ఛాన్స్ ఉంది.

ప్రభుత్వ టికెట్ల కమిటి చేసిన ప్రతిపాదనలు ప్రకారం.. సెంటర్లతో నిమిత్తం లేకుండా ధరలు ఉండాలని సూచించింది కమిటీ. ప్రాంతం ఏదైనా ఏసీ లేదా మల్టీప్లెక్స్ థియేటర్లలో కనీస టికెట్ ధర 50 రూపాయలు, గరిష్టం 150 ఉండాలని.. ఎయిర్ కూలర్ థియేటర్లలో కనీసం 40, గరిష్టం 120, నాన్ ఏసీ థియేటర్లలో కనీసం 30, గరిష్టం 70 రూపాయలు, రిక్లయినర్ క్లాస్ కు 250 రూపాయలు ఉండాలని తెలిపింది సర్కార్.

జీవో 35 ప్రకారం

గ్రామ పంచాయతీల్లో టికెట్ ధరలు-

నాన్ ఏసీ థియేటర్ల కనీస టికెట్ ధర 5 రూపాయలు- గరిష్టం 15

ఏసీ, ఎయిర్ కోలర్ థియేటర్లలో కనీస టికెట్ ధర 10 రూపాయలు- గరిష్టం 20

మల్టీప్లెక్సుల్లో కనీస టికెట్ ధర 30 రూపాయలు- గరిష్టం 80

నగర పంచాయితీల్లో –

నాన్ ఏసీ థియేటర్ల కనీస టికెట్ ధర 10 రూపాయలు- గరిష్టం 25

ఏసీ, ఎయిర్ కోలర్ థియేటర్లలో కనీస టికెట్ ధర 15 రూపాయలు- గరిష్టం 35

మల్టీప్లెక్సుల్లో కనీస టికెట్ ధర 40 రూపాయలు- గరిష్టం 120

మున్సిపాలిటీ ప్రాంతాల్లో –

నాన్ ఏసీ థియేటర్ల కనీస టికెట్ ధర 15 రూపాయలు- గరిష్టం 50

ఏసీ, ఎయిర్ కోలర్ థియేటర్లలో కనీస టికెట్ ధర 30 రూపాయలు- గరిష్టం 70

మల్టీప్లెక్సుల్లో కనీస టికెట్ ధర 60 రూపాయలు- గరిష్టం 150

మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో –

నాన్ ఏసీ థియేటర్ల కనీస టికెట్ ధర 20 రూపాయలు- గరిష్టం 60

ఏసీ, ఎయిర్ కోలర్ థియేటర్లలో కనీస టికెట్ ధర 40 రూపాయలు- గరిష్టం 100

మల్టీప్లెక్సుల్లో కనీస టికెట్ ధర 75 రూపాయలు- గరిష్టం 250

Read more RELATED
Recommended to you

Latest news