లవ్ స్టొరీ కథకు అదే ఆధారం.. శేఖర్ కమ్ముల క్లారిటీ..!

నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలకాబోతున్న ఈ సినిమా కథ గురించి కొన్ని రోజులుగా ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను మిర్యాలగూడ పరువు హత్య నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు అంటూ వార్తలు వినిపించాయి. అయితే దీనిపై శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ ఓ ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం మధురానగర్ లో చిత్రీకరించినట్టు తెలిపారు. ఈ సినిమాలో పాత్రలు ఎంతో ఇంట్రెస్టింగ్ ఉంటాయని చెప్పారు. ఫిదా సినిమాలో సాయి పల్లవికి ఈ సినిమాలో సాయి పల్లవికి చాలా తేడా ఉంటుంది అన్నారు. ఇక ఈ సినిమాలో లో సున్నితమైన అంశం కులాల అసమానత.. మరియు లింగ వివక్షత ను చూపిస్తామని చెప్పారు. అంతేకాకుండా సినిమా చాలా ఎమోషనల్ గా ఉంటుందని చెప్పారు. అయితే హీరో చివరికి చనిపోతారా లేదా అన్నది మాత్రం శేకర్ కమ్ముల సస్పెన్స్ గానే ఉంచారు.