రేవంత్ రెడ్డిపై పరువు నష్ట దావా వేసిన కేటీఆర్ !

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కి దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చారు తెలంగాణ మంత్రి కేటీఆర్‌. తన పై వస్తున్న ఆరోపణల నేపథ్యం లో పరువు నష్టం దావా వేశారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్‌. తన పై కొంత మంద్రి తప్పుడు చేస్తున్నారని… ఈ నేపథ్యం లో హై కోర్టు లో పరువు నష్టం దావా వేస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ తన ట్విట్టర్‌ వేదిక గా పేర్కొన్నారు.

తన తప్పుడు ఆరోపణ లు చేసే వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు మంత్రి కేటీఆర్‌. కోర్టు వారిపై చర్యలు తీసుకుంటుందని అభిప్రాయ పడ్డారు. కాగా… తెలంగాణ రాజకీయాల్లో ఛాలెంజ్‌ ల పర్వం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు నేపథ్యం లో… తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మధ్య సవాళ్ల రాజకీయం నడుస్తోంది. డ్రగ్స్‌ టెస్టు లకు నువ్వు సిద్ధమా ? అంటే నువ్వు సిద్ధమా అన్న రీతిలో ఇద్దరూ నేతలు రెచ్చిపోతున్నారు.