యూట్యూబ్ ను షేక్ చేస్తున్న చైతూ లవ్ స్టోరీ..!

అక్కినేని హీరో నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం ల‌వ్ స్టోరీ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా చైతూకు జోడీగా సాయి ప‌ల్లవి న‌టించింది. ఇక శేఖ‌ర్ క‌మ్ముల సినిమాకు ఉండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. మంచి కాఫీలాంటి సినిమాలు తీయ‌డంలో శేఖ‌ర్ క‌మ్మ‌లే దిట్ట అని ప్రేక్ష‌కులు భావిస్తుంటారు. ఇక చ‌క్క‌నైన ప్రేమ‌క‌థ‌ల‌ను తెర‌కెక్కించే శేఖ‌ర్ క‌మ్ముల చివ‌ర‌గా ఫిదా సినిమాతో వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేశారు.

దాంతో చైతూ ల‌వ్ స్టోరీపై కూడా భారీ అంచ‌నాలున్నాయి. ఇక తాజాగా నిన్న ల‌వ్ స్టోరీ ట్రైల‌ర్ ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా ఈ ట్రైల‌ర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ట్రైల‌ర్ విడుద‌లైన కొన్ని గంట‌ల్లోనే 5మిలియ‌న్స్ వ్యూవ్స్ రాగా ప‌ది గంట‌ల్లో ట్రైల‌ర్ కు 300 కే లైక్స్ వ‌చ్చాయి. ఇక ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్న ఈ ట్రైల‌ర్ కే భారీ రెస్పాన్స్ వ‌స్తుండ‌టంతో సినిమా ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.