ఏపీలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది..యువతి ఇంటికెళ్లి మరీ!

-

ఏపీలోని గుంటూరు జిల్లా బాపట్లలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.గత కొంతకాలంగా ఓ యువతిని ప్రేమపేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడు. అతని ప్రవర్తన చూసి యువతి అతన్ని నిరాకరించడంతో ఆమె మీద కక్షగట్టాడు. ఏకంగా ఆమె మీద కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఏపీలోని బాపట్లలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. భార్గవ్ రెడ్డి అనే యువకుడు గత కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు.

Father’s knife attack on loving couple

తిరిగి తనను కూడా ప్రేమించాలని వేధించసాగాడు.యువతి అతని ప్రేమను తిరస్కరించడంతో కక్షగట్టిన భార్గవ్.. ఆదివారం అర్థరాత్రి యువతి ఇంటికెళ్లిన అతడు ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అడ్డొచ్చిన ఆమె తల్లిదండ్రులపై కూడా దాడిచేయడంతో ముగ్గురికీ తీవ్రగాయాలయ్యాయి. బాధితులు గట్టిగా కేకలు వేయడంతో అక్కడికి వచ్చిన స్థానికులు ఆ ముగ్గురినీ ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news